సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 2 సెప్టెంబరు 2017 (17:14 IST)

గణపతి-ఈద్ పైన నటి కాజోల్ కామెంట్... లాస్ట్ వార్నింగ్ అంటూ నెటిజన్

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక ఎవరు ఎలా చెబితే దానికి వెనువెంటనే ప్రతిస్పందించడం కనబడుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గణపతి నిమజ్జనం, బక్రీద్ పండుగలను పురస్కరించుకుని ఓ ట్వీట్ చేసింది. అభిమానుల‌కు గ‌ణేశ్ ఉత్స‌వ్‌, బ‌క్రీద్ పండుగ‌ల శుభాకాంక్ష

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక ఎవరు ఎలా చెబితే దానికి వెనువెంటనే ప్రతిస్పందించడం కనబడుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గణపతి నిమజ్జనం, బక్రీద్ పండుగలను పురస్కరించుకుని ఓ ట్వీట్ చేసింది. అభిమానుల‌కు గ‌ణేశ్ ఉత్స‌వ్‌, బ‌క్రీద్ పండుగ‌ల శుభాకాంక్ష‌లు అంటూనే `గ‌ణ‌ప‌తి, ఈద్ పండుగ‌ల‌ను దేవుళ్లే కలసి ఒకేరోజు జ‌రుపుకుంటున్నారు. మ‌రి మ‌న‌మెందుకు జ‌రుపుకోకూడ‌దు?` అని ట్వీట్ చేశారు. 
 
దీనిపై ఓ ముస్లిం సోదరుడు రీ-ట్వీట్ చేస్తూ తీవ్రంగా స్పందించాడు. 'ఇదే మీకు నా చివ‌రి హెచ్చ‌రిక‌, లేదంటే జ‌ర‌గ‌బోయే వివాదానికి మీరే బాధ్యత వ‌హించాల్సి ఉంటుంది' అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. కాగా అతడి ట్వీటును కొందరు విమర్శించారు. కాజోల్ చేసిన ట్వీట్ లోని అంతరార్థాన్ని గమనించాలంటూ వారు కామెంట్లు పెట్టారు.