'అమ్మ'పై కమల్ ట్వీట్... చనిపోయినా నీ కసి చల్లారదా...? నెటిజన్లు ఫైర్
బతికేదాకా ఎలా బతికింది.. రోగం వస్తే.. ఏమయిందంటూ.. రకరకాలుగా వార్తలు ప్రచారం చేసే సెటిజన్లు... జయలలిత విషయంలో ఎలా ప్రవర్తించారో తెలిసిందే. అయితే.. ఆమె మరణించిన తర్వాత పలువురు సినీప్రముఖులు తగు విధంగా నివాళులర్పించారు. రజనీకాంత్ ఏకంగా భౌతికకాయాన్ని సం
బతికేదాకా ఎలా బతికింది.. రోగం వస్తే.. ఏమయిందంటూ.. రకరకాలుగా వార్తలు ప్రచారం చేసే సెటిజన్లు... జయలలిత విషయంలో ఎలా ప్రవర్తించారో తెలిసిందే. అయితే.. ఆమె మరణించిన తర్వాత పలువురు సినీప్రముఖులు తగు విధంగా నివాళులర్పించారు. రజనీకాంత్ ఏకంగా భౌతికకాయాన్ని సందర్శించారు. కమల్ మాత్రం రాలేకపోయారు.
రాష్ట్రంలో లేకపోవడంతో ఆయన తన నివాళిని ట్వీట్ ద్వారా తెలియజేశారు. అందులో వాడిన భాషపై సెటిజన్లు కమల్‌పై ధ్వజమెత్తారు. 'జయలలితను నమ్ముకొని బతుకుతున్న వారి పట్ల సానుభూతి వ్యక్తపరుస్తున్నా' అన్న అర్థం వచ్చేలా ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ వేయడం అస్సలు బాగాలేదని నెటిజన్స్ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కారణం.. కమల్ నటించిన 'విశ్వరూపం' విడుదల కాకుండా జయలలిత దగ్గరుండి ప్లాన్ చేశారన్నది కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కమల్ అలా ట్వీట్ చేశారని అంటున్నారు.