నిధి అగర్వాల్... నీలాంటివల్లే అలాంటి దారుణాలన్న నెటిజన్, నీవు పింక్ చూడాలంటూ నిధి రిప్లై

Nidhi Agarwal
ఐవీఆర్| Last Modified సోమవారం, 2 డిశెంబరు 2019 (17:36 IST)
కామాంధులు రెచ్చిపోయినప్పుడల్లా సినీ ఇండస్ట్రీలోని గ్లామర్ హీరోయిన్లలో కొందరికి ఇబ్బందికరమైన పోస్టులు వచ్చిపడుతుండటం గతంలో ఎన్నోసార్లు జరిగింది. తాజాగా నిధి అగర్వాల్ పైన కూడా ఓ నెటిజన్ వివాదాస్పద పోస్ట్ చేశాడు.

నిధి అగర్వాల్ తన గ్లామరస్ ఫోటోను ఒకదాన్ని పోస్ట్ చేస్తూ... రిలాక్స్ అంటూ జోడించింది. దాన్ని చూసిన ఓ నెటిజన్... నీలాంటి వారి వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. దీనిపై నిధి అగర్వాల్ మండిపడ్డారు.

సదరు నెటిజన్ దిమ్మతిరిగే రిప్లై ఇస్తూ... ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం తనను షాక్‌కి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఇలాంటివారిని చూస్తుంటే ఆశ్చర్యకరంగా వుంటుందనీ, నీ అడ్రెస్ పంపిస్తే నీకు పింక్ అనే సినిమా లింక్ పంపుతాననీ, ఆ సినిమా నీలాంటివారికి చాలా అవసరం అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. ఇపుడు దీనిపై ట్విట్టర్లో కామెంట్ల పరంపర నడుస్తోంది.దీనిపై మరింత చదవండి :