శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (13:08 IST)

గుళ్లో చేసిన పనికి చిక్కుల్లో పడ్డ హీరోయిన్..?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ నివేదా పేతురాజ్. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న ఈ హీరోయిన్ అక్కడ చేసిన పనులకు చిక్కులు కొని తెచ్చుకుంది.
 
ఇప్పటికే మధురై మీనాక్షి ఆలయంలో సెల్‌ఫోన్‌ల వాడకాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఫిబ్రవరి 2018 నుండి ఈ ఉత్తర్వులు అమలవుతున్నాయి. మధురై మీనాక్షి ఆలయాన్ని తన స్నేహితురాలితో కలిసి దర్శించుకున్న నివేదా ఆలయ ప్రాంగణంలో తీసుకున్న ఫోటోలు, అలాగే వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
వీటిని చూసిన నెటిజన్లు నిబంధనలు పాటించకుండా సెల్ ఫోన్ ఎలా వాడారు? వాటిని నిషేధం ఉన్న విషయం మీకు తెలియదా? అంటూ ఆమె ప్రశ్నించారు. సామాన్య ప్రజల సెల్ ఫోన్లు అనుమతించని అధికారులు సెలబ్రిటీల అయితే మాత్రం నిబంధనలు పాటించకుండా ఉంటే ఏ మాత్రం పట్టించుకోరా...ఇలా ద్వంధ్వ వైఖరి ప్రదర్శించడమేంటని మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తన ఖాతా నుండి వాటిని తొలగించేసింది.