బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (13:09 IST)

'క్వీన్' డైరెక్టర్ రూమ్‌ షేర్‌ చేసుకుంటానంటే ఇబ్బంది లేదన్నాడు... నయనీ దీక్షిత్

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మీటూ ప్రకంపనలతో దద్దరిల్లిపోతోంది. తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. తాముకూడా మీటూ బాధితులమేనంటూ ముందుకొచ్చేవారి సంఖ్యా పెరుగుతోంది.
 
బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తా - నానా పటేకర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చాక, తమ జీవితాల్లో జరిగిన చీకటి ఘడియలను పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయా ఘటనల్లో పలువురు దోషులుగా నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా 'క్వీన్'’ దర్శకుడు వికాస్‌ బెహల్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. 
 
వికాస్‌ బెహల్‌ తనతో ఎలా ప్రవర్తించాడో ఇప్పటికే కంగన బాహాటంగా వెల్లడించింది. ఇపుడు ఆ చిత్రంలో కంగన స్నేహితురాలిగా నటించిన నయనీ దీక్షిత్‌ తాజాగా మీడియా ముందుకొచ్చారు. 'నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు క్వీన్‌లో నటించడం. నాతో వికాస్‌ అసభ్యకరంగా ప్రవర్తించాలనుకున్నాడు. "ఇంకోసారి చేయిపడితే చంపేస్తా"నని హెచ్చరించా. షూటింగ్‌ సమయంలో నాకు టూ స్టార్‌ హోటల్‌ని బుక్‌ చేసేవాడు. సౌకర్యవంతంగా లేదని చెప్పినప్పుడు "నువ్వు నా రూమ్‌ షేర్‌ చేసుకుంటానంటే.. నాకెలాంటి ఇబ్బందీ లేదు" అనేవాడు. అతని గురించి అందరికీ తెలుసు' అని వ్యాఖ్యానించింది. ఈ మాటలు ఇపుడు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.