గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (14:11 IST)

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లే ఇలాంటి క‌థ చేసి విజ‌యం సాధించారు: జ‌య‌ప్ర‌ద‌

Venkat Rajesh, Jayaprada
``ఎన్టీఆర్ఏ, ఎన్ఆర్ గార్లు `పరమానందయ్య శిష్యులు కథ`తో సినిమాలు చేసి విజయం సాధించారు. ఇప్పుడు 3డి ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను`` అని సీనియ‌ర్ న‌టి జయప్రద అన్నారు. బాల‌ల‌తో తీస్తున్న 3డి సినిమా `శ్రీ పరమానందయ్య శిష్యుల కథ`. ఈ సినిమా ప్రీరిలీజ్‌లో ఆమె మాట్లాడారు.

ఈ సినిమాను  బాలాజీ నాగలింగం గారు బాధ్యతగా తీసుకొని విడుదల చెయ్యడం సంతోషం. సీనియర్ నటుడు శివకృష్ణ, బుర్రా సాయి మాధవ్ ఆశీస్సులు ఈ సినిమాకు ఉండడం అనేది గొప్ప విషయం. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద విజయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా విడుదలై దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు` జ‌య‌ప్ర‌ద తెలిపారు.
 
పింక్ రోజ్ సినిమాస్ బ్యానర్ పై  ఎమ్. బాలాజీ నాగలింగం, శ్రీనివాస్ రావు బండి సమర్పణలో వస్తోన్న సినిమా ఇది. వెంకట్ రాజేష్ పులి దర్శకత్వం వహించ‌గా కాటమ్ రెడ్డి శ౦తన్ రెడ్డి, సి.హెచ్.కిరణ్ శర్మ నిర్మించారు. రచయిత బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ, కమర్సియల్ గా కాకుండా ఒక మంచి సినిమా చెయ్యాలనే ఆలోచనాతో పరమానందయ్య శిష్యుల కథను సినిమాగా చేసిన వీరికి అభినందనలు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ సినిమాలో పరమానందయ్య గా నటించడం విశేషం. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలి. ఈ చిత్ర దర్శక నిర్మాతలకు పరమానందయ్య శిష్యుల కథ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు.
 
గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ, పరమానందయ్య శిష్యుల కథ సినిమా ఒక అద్భుతమైన వాతావరణంలో జరిగింది. డైరెక్టర్ నన్ను కేవలం పది రోజుల డేట్స్ కావాలని అడిగారు కానీ సినిమా పూర్తి అయ్యే సరికి 35 రోజులు నటించాను. అంతగా సినిమా నన్ను ఆకట్టుకుంది. అందరూ బాగా చేశారు, నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
 
నిర్మాత కాటమ్ శాంతన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా చెయ్యాలని అనిపించినప్పుడు డైరెక్టర్ వెంకట్ రాజేష్ నన్ను అప్రోచ్ అయ్యారు. తాను అనుకున్నంది అనుకున్నట్లు తీశారు. అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుంది ఇది, ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాను అమితంగా ఇష్టపడతారు అన్నారు.   ద‌ర్శ‌కుడు వెంకట రాజేష్ పులి మాట్లాడుతూ, ముఖ్యంగా పిల్లలు బాగా సపోర్ట్ చెయ్యడం వల్లే సినిమా బాగా వచ్చింది. గుమ్మడి గోపాలకృష్ణ గారి పాత్ర సినిమాకే హైలెట్ కానుంది. ఒక మంచి ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. ఈ సినిమాను అందరూ ఆదరించి విజయవంతం చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.