శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (11:40 IST)

శ్రీకాకుళంలో ఎన్టీఆర్... ఎందుకో తెలుసా..?

శ్రీకాకుళంలో ఎన్టీఆర్ అన‌గానే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అక్క‌డ ఉన్నారు అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏంటంటే... నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న సినిమా ఎన్టీఆర్.

శ్రీకాకుళంలో ఎన్టీఆర్ అన‌గానే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అక్క‌డ ఉన్నారు అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏంటంటే... నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న సినిమా ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలో చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ చేసారు. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో బ‌స‌వ‌తార‌కం పాత్ర పోషిస్తోన్న బాలీవుడ్ భామ విద్యాబాల‌న్ పైన కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. 
 
ఆ త‌ర్వాత సెకండ్ షెడ్యూల్‌లో చంద్ర‌బాబు నాయుడు పాత్ర పోషిస్తోన్న ద‌గ్గుబాటి రానా, బాల‌య్యపై కొన్ని సీన్స్ చిత్రీక‌రించారు. ఇక మూడ‌వ షెడ్యూల్‌లో అక్కినేని పాత్ర పోషిస్తోన్న సుమంత్, బాల‌య్యపై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. 
 
ఇక తాజా షెడ్యూల్‌ను అక్టోబర్ 4 నుంచి శ్రీకాకుళంలో ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఎన్టీఆర్ ప్ర‌చారం శ్రీకాకుళం నుంచి ప్ర‌చార ర‌థంలో ప్రారంభించారు. అందుచేత శ్రీకాకుళంలోనే షూట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ జాయిన్ అవుతారు. ఆయ‌న ఇందులో తండ్రి హ‌రికృష్ణ పాత్ర పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో దాదాపు స‌గం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే. స్వ‌ర‌వాణి కీర‌వాణి ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 9న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ ఎన్టీఆర్ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు.