కాఫీలో ఆ శక్తి ఎక్కువగా వుందట..
కాఫీని రోజుకు రెండు కప్పులు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూ కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. నిత్యం కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస
కాఫీని రోజుకు రెండు కప్పులు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూ కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. నిత్యం కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలూ తగ్గుతాయి.
కాఫీలో ఉండే కెఫీన్ నాడీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో రక్తంలో ఎపినెఫ్రిన్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా శారీరక దృఢత్వం లభిస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు. వయస్సు మీద పడడం కారణంగా చాలా మందికి అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. అయితే రోజూ కాఫీ తాగితే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
తాజాగా కాఫీలోని కెఫీన్‌కు నొప్పిని తట్టుకునే శక్తి వున్నట్లు తేలింది. తాజాగా అలబామా యూనివర్సిటీ నిర్వహించిన తాజా సర్వేలో.. కెఫీన్ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చుతగ్గులున్నట్లు పరిశోధకులు తేల్చారు. 19-77 ఏళ్ల వయస్సు మధ్య గల 62 మందిపై ఈ పరిశోధన జరిగింది.
ఇందులో కాఫీ తాగే వారిలో నొప్పిని భరించే శక్తి అధికంగా వున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాఫీతో పాటు ఆకుకూరలు వంటి మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలోనూ నొప్పి భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.