గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (19:32 IST)

ఆస్ట్రేలియాలో #RRR మానియా - కార్లతో ఆర్ఆర్ఆర్ ఆకృతి

ఆస్ట్రేలియాలో ఆర్ఆర్ఆర్ మానియా ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన వీరాభిమానులు కొందరు దాదాపు 70కి పైగా కార్లతో ఆర్ఆర్ఆర్ ఆకృతితో కార్లను పార్కింగ్ చేసి, సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 
 
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతుంది. 
 
దీంతో తారక్, రాంచరణ్ అభిమానుల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల కంటే విదేశాల్లో ఈ సదండి అధికంగా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఆర్ఆర్ఆర్ సందడి ఎక్కువగా ఉంది. మెల్బోర్న్‌లో ఎన్టీఆర్ అభిమానులు 70కి పైగా కార్లతో ఆర్ఆర్ఆర్ ఆకృతిని ప్రదర్శించారు. 
 
అంతేకాదు జై ఎన్టీఆర్ అనే అక్షరాలను కూడా కార్ల ద్వారా ప్రదర్శించారు. నినాదాలు చేస్తూ, ఎన్టీఆర్‌పై తమకున్న అభిమానాన్ని వారు చాటుకున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియోను శ్రేయాస్ గ్రూపు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.