ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (18:59 IST)

కర్నాటక గడ్డపై #RRR ప్రిరీలీజ్ ఈవెంట్.. భారీగా ఫ్యాన్స్ రాక

ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న "ఆర్ఆర్ఆర్" రిలీజ్ తేదీ సమీపిస్తుంది. దీంతో ఆ చిత్రం మరోమారు ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇందులోభాగంగా, శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను నిర్వహించింది. శనివారం రాత్రి కర్నాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్‌లో ఈ వేడుకను నిర్వహిస్తుంది. 
 
ఈ వేడుక కోసం కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ప్రాంతాలకు చెందిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించి చిత్ర దర్శకుడు రాజమౌళి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఎగ్జైట్‌మెంట్‌ను ఆపుకోలేకపోతున్నామని, చాలా పెద్ద ఈవెంట్ జరుగనుందని, ఎన్నో ఏళ్ల తర్వాత అందరినీ కలవబోతున్నామని తెలిపారు. 
 
ఇదిలావుంటే, ఈ ఫంక్షన్ జరిగే వేదిక వద్దకు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఓ దశలో అభిమానులను నియంత్రణ చేయడం కష్టంగా మారింది. ఒక్కసారిగా ఫ్యాన్స్ బారికేడ్లు తోసుకుని రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కుర్చీలు విరిగాయి.