ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

రాముడు భీముడుతో కలిసి అమీర్ ఖాన్ "నాటు" స్టెప్పులు

తెలుగు చిత్రపరిశ్రమలో రాముడు భీముడుగా ఉన్న టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్టెప్పులు వేశారు. రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్రం బృందం బిజీగా ఉంది. శనివారం రాత్రి కర్నాటక రాష్ట్రంలో ప్రిరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆదివారం రాత్రి ఢిల్లీలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 
 
ఈ వేడుక జరిగిన వేదికపైనే ఆయన నాటు పాటకు స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు. అమీర్ ఖాన్‌కు ఎన్టీఆర్ స్టెప్పులు వివరించగా, ఆ తర్వాత ఆ ముగ్గురు హీరోలు కలిసి డ్యాన్స్ చేయడం అభిమానులకు కన్నులపండుగగా కనిపించింది. 
 
కాగా, 'ఆర్ఆర్ఆర్' చిత్రం స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలో తెరకెక్కుతున్న కల్పిత చిత్రం. తారక్, చెర్రీలు టైటిల్‌ రోల్స్ పోషించగా, అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.