భారీ విన్యాసాలతో ఎన్.టి.ఆర్. దేవర తాజా అప్‌డేట్
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. నటిస్తున్న తాజా సినిమా దేవర. ఇటీవలే ఎన్.టి.ఆర్. పుట్టినరోజునాడు వచ్చిన ఫస్ట్‌లుక్ అందరినీ ఆకర్షించింది. ఈ సినిమా సముద్రంలో ఎక్కువ భాగం జరగడంతో ఇందులో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ దాదాపు వంద కోట్లు రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిసిందే. ఇందులో సముద్ర దొంగలు షిప్‌లను దోచుకునే సన్నివేశాలు, సముద్రం అడుగున కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన దేవర టీమ్ ఓ ఫోటోను షేర్ చేసింది.
సముద్రంలో వేటకు సిద్ధమవుతున్న గజవేటగాడు. సముద్రం అడుగున భారీ విన్యాసాలు. వీటి కోసం ముంబై నుంచి వచ్చిన భారీ యాక్షన్ బృందం. అని వివరాలు తెలియజేసింది. ముంబై వంటి సముద్రతీరంలో వుండే సముద్ర గజ ఈతగాళ్ళు జాలరులు ఈ దేవరలో పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జాన్వికపూర్ నటిస్తోంది. ఎన్.టి.ఆర్. ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.