1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:34 IST)

తప్పుకున్న కమల్.. శింబు హోస్ట్‌గా తమిళ బిగ్ బాస్ షో..!

Simbu
బిగ్ బాస్ రియాల్టీ షోకు నటుడు శింబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా విజయ్ టీవీలో బిగ్ బాస్ అల్టిమేట్ షో ప్రసారమవుతుండగా, ఈ షోను విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
వున్నట్టుండి విశ్వనటుడు కమల్ హాసన్ షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అతని స్థానంలో శింబు ఈ షోను హోస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఓ ప్రోమో వీడియో కోసం సింబు మేకప్‌కు ఫోజులిచ్చిన ఫోటోను హాట్‌స్టార్ అధికారికంగా విడుదల చేసింది. 
 
దీని తరువాత, నటుడు శింబు ఇప్పుడు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను కూడా హాట్‌స్టార్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.