ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (13:47 IST)

డబ్బుకు కక్కుర్తిపడి పాడుపని చేసిన పాకిస్థాన్ మోడల్

పాకిస్థాన్ మోడల్ ఒకరు తలదించుకునేలా ఓ పాడుపని చేశారు. డబ్బుకు కక్కుర్తిపడిన ఆ నటి అలా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డారు. పాకిస్థాన్‌లో మోడల్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న సుందరి అయ్యన్ అలీ. ఈమె డబ్బుకు కక్

పాకిస్థాన్ మోడల్ ఒకరు తలదించుకునేలా ఓ పాడుపని చేశారు. డబ్బుకు కక్కుర్తిపడిన ఆ నటి అలా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డారు. పాకిస్థాన్‌లో మోడల్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న సుందరి అయ్యన్ అలీ. ఈమె డబ్బుకు కక్కుర్తిపడి కరెన్సీ స్మగ్లింగ్‌కు పాల్పడింది. 
 
ఇస్లామాబాద్ నగరంలోని బేనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులకు అయ్యన్ అలీ బ్యాగులో 506,000 డాలర్లు లభించాయి. పాక్ కస్టమ్స్ అధికారులు డాలర్లను స్వాధీనం చేసుకొని నిందితురాలైన మోడల్‌ను కస్టమ్స్ కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ కేసును విచారించిన జడ్జి ఆమెను అరెస్టు చేయాలని వారెంట్ జారీచేశారు. గతంలోనూ ఈ మోడల్ పై దుబాయ్ విమానంలో 500,000 డాలర్లను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. అప్పడు కోర్టు ఉత్తర్వులతో అయ్యన్ అలీ రావల్ పిండీ అధిలా జైలులో నాలుగునెలల జైలు శిక్ష అనుభవించారు. అయినా తన తీరు మార్చుకోకుండా మరోమారు జైలుపాలయ్యారు.