శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (16:11 IST)

ఆర్ఆర్ఆర్‌తో పఠాన్ పోటీ.. ఆ రికార్డుకు చేరువలో షారూఖ్ సినిమా

pathaan movie still
స్టార్ బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమా రికార్డులను సొంతం చేసుకుంటోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించింది. జాన్ అబ్రహాం కీలక పాత్ర చేశాడు. 
 
కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్ర చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీ 9 రోజుల్లో ఓవర్సీస్‌లో 33 మిలియన్స్ వరకూ రాబట్టి సంచలనం సృష్టించింది. తద్వారా ఫుల్ రన్‌లో ఆర్ఆర్ఆర్ వసూలు చేసిన 34 మిలియన్ డాలర్ల రికార్డుకు చేరువకు వచ్చింది. 
 
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీ తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 690 కోట్లకు కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అందులో హిందీలోనే దాదాపు రూ. 680 కోట్ల వరకూ వచ్చింది. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో పఠాన్ రెండో స్థానానికి చేరుకుంది.