సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (11:39 IST)

పవన్ కళ్యాణ్ ఎడమచేతికి స్వల్ప గాయం.. ఆందోళన అవసరం లేదు..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్‌ ప్రమాదానికి గురైయ్యారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చి

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్‌ ప్రమాదానికి గురైయ్యారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతుండగా, ఓ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్న వేళ, స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే చిన్న గాయం కాగా.. దాన్ని లెక్క చేయకుండా పవన్ కల్యాణ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ గాయం కూడా చిన్నదేనని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూనిట్ వెల్లడించింది. షూటింగ్ యధావిథిగా జరుగుతోంది. 
 
పవన్ కల్యాణ్ ఎడమచేతికి గాయమైనట్లు ఇన్‌సైడ్ సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం‌లేదని అన్నట్లు తెలుస్తోంది. పవన్ చేతికి గాయం అయినట్టు సోషల్‌మీడియాలోనూ ప్రచారం సాగుతోంది. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత పవన్ ఫిల్మ్ గురించి ఓ పిక్ బయటకు వచ్చిందంటున్నారు.
 
ఇకపోతే.. పవన్ ఎడమచేతికి గాయమైనట్లు ఇన్‌సైడ్ సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం‌లేదని అన్నట్లు తెలుస్తోంది. పవన్ చేతికి గాయం అయినట్టు సోషల్‌మీడియాలోనూ ప్రచారం సాగుతోంది. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత పవన్ ఫిల్మ్ గురించి ఓ పిక్ బయటకు వచ్చిందంటున్నారు.