పవన్ కళ్యాణ్‌కు అదేమీ తెలియదు... వినోద్ హత్యకు కారణం అది కాదు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హత్య మరో సినీ హీరో అభిమాని చేశాడనే వాదనపై సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. అసలు వినోద్ హత్యకు కారణం హీరోల ఫ్యాన్స్ అంశమే కాదంటూ కొందరు వాదిస్తున్నారు. వారి మధ్య తలెత్తిన ఓ గొడవ కారణం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హత్య మరో సినీ హీరో అభిమాని చేశాడనే వాదనపై సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. అసలు వినోద్ హత్యకు కారణం హీరోల ఫ్యాన్స్ అంశమే కాదంటూ కొందరు వాదిస్తున్నారు. వారి మధ్య తలెత్తిన ఓ గొడవ కారణంగా పరస్పరం ఘర్షణ జరిగి హత్య జరిగిందని వాదిస్తున్నారు.
ఐతే ఆ గొడవ ఏంటయా అంటే మాత్రం ఎవ్వరూ చెప్పడంలేదు. ఇదంతా పవన్ కళ్యాణ్‌కు తెలియదనీ, ఆయన కేవలం వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకే వెళ్లాడంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద అభిమానుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.