శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (15:33 IST)

వేశ్య పాత్రలో అందాలను ఆరబోయనున్న పాయల్ రాజ్‌పుత్

"ఆర్ఎక్స్ 100" చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన రాజస్థాన్ పిల్ల పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఆమె అందాలను ఆరబోసింది. ముఖ్యంగా నెగెటివ్ పాత్రలో రెచ్చిపోయింది. అటు నటనపరంగా, ఇటు అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. అలా కుర్రకారుకి కునుకులేకుండా చేస్తున్న పాయల్ రాజ్‌పుత్... ఇపుడు వేశ్య పాత్రలో మరింత రెచ్చిపోనుందట. 
 
ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'టైగర్ నాగేశ్వర్రావు'. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో పాయల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమె ఓ వేశ్యగా కనిపించనున్నట్టుగా సమాచారం. ఈ పాత్రలో ఆమె చాలా బోల్డ‌గా నటించనుందట. 
 
1980 - 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా జనాలను భయపెట్టిన 'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. 'టైగర్ నాగేశ్వర్రావు'గా బెల్లంకొండ చేసే దొంగతనాలకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.