కన్నడ హీరో గణేష్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం
తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ స్థాపించి పలు చిత్రాలు తీసిన టీజీ విశ్వ ప్రసాద్ ఇక్కడ సక్సెస్ లు చూసిన తర్వాత దక్షిణాది భాషల్లోనూ నిర్మిస్తానని అప్పట్లో ప్రకటించారు. తాజాగా ఆయన శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్ తో సినిమా చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. ఇప్పుడు గణేష్ నటించిన కృష్ణం ప్రణయ సఖి- ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు.
కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ఢమాకా న్యూ-సెన్స్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సహకారం అందించింది. #PMF49తో, వారు గణేష్ లీడ్ రోల్ లో గొప్ప సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అందించడం ద్వారా కన్నడ సినిమా పట్ల తమ నిబద్ధతను చాటారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రం యూనిక్ అండ్ లార్జ్ దెన్ లైఫ్ స్టొరీగా వుండబోతోంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
ఈ సినిమా టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.