ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (20:32 IST)

పెప్సీ ఆంటీగా అప్స‌రా రాణి

Apsara Rani
Apsara Rani
రామ్‌గోపాల్ వ‌ర్మ `డీ కంపెనీ`లో ఖ‌మ‌త్ అంటూ సాంగేసుకుని అందాల‌ను ఆర‌బోసిన అప్స‌రాణి తాజాగా `సిటీమార్` చిత్రంలో మెర‌వ‌నుంది. పెప్సీ ఆంటీ! అంటూ యూత్‌ను అల‌రించ‌నుంది. గోపీచంద్ హీరోగా తమ‌న్నా నాయిక‌గా భూమిక కీల‌క పాత్ర పోషించిన సినిమా `సీటీమార్`. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలోని పెప్సీ ఆంటీ.. సాంగ్‌ను ఈనెల 21వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. మ‌ణిశ‌ర్మ బాణీలు స‌మ‌కూర్చిన ఈ సాంగ్ చిత్రానికి ఈ పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తంద‌ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తున్నాడు.
 
ఇటీవ‌లే `జ్వాలారెడ్డి.. జ్వాలారెడ్డి.. తెలంగాణ బిడ్డ‌రో..కారాబోంది ల‌డ్డురో..కారాబోంది ల‌డ్డురో` సాంగ్‌ను త‌మ‌న్నా, గోపీచంద్‌పై చిత్రించారు. ఈ సాంగ్‌కు మంచి ఆద‌ర‌ణ పొందింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయ‌నున్నారు.
గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.