సోషల్ మీడియాలో నాపై వ్యక్తిగత దూషణలు: సిపి సజ్జనార్‌కి మాధవీలత ఫిర్యాదు
గత కొంత కాలంగా తనపై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్నారనీ, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ సిపి సజ్జనార్ కి సినీ నటి, భాజపా నాయకురాలు ఫిర్యాదు చేసారు.
ఏ కేసులో అయినా అమ్మాయిలు పట్టుబడితే అందులో నేను కూడా వున్నానంటూ ప్రచారం చేస్తున్నారనీ, ఈ ప్రచారం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.
తనపై ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మాధవీలత తెలిపారు.