సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (17:29 IST)

అక్కను వేధించిన తమ్ముడు.. అభ్యంతరకరమైన మెసేజీలు పెడుతూ..

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అన్న సినీ పాటను నిజం చేస్తూ ఓ కామాంధుడు వావివరుసలు మరిచి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
 
వరుసకు అక్క అయ్యే మహిళపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి తోడు.. తన వికృత చర్యలన్నీ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇవన్నీ బాధితురాలి దృష్టికి రావడంతో ఆమె పోలీసులు ఆశ్రయించారు. 
 
సోషల్ మీడియాలో అసభ్య మెసేజీలు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడినట్టు విచారణలో బయటపడటంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.