గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (13:43 IST)

సిద్ధుతో పాటు ఆ ముగ్గురిని పట్టిస్తే రూ.లక్ష క్యాష్ రివార్డ్.. ఎందుకంటే?

Sidhu
రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. హింసాత్మక ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. హింసకు కారణమైన వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురికి నోటీసులు జారీచేశారు. అంతేకాదు ప్రముఖ పంజాబీ నటుడు దీప్‌ సిద్దు గురించి సమాచారం తెలిపిన వారికి నగదు ప్రోత్సాహకం అంజేస్తామని ప్రకటించారు.
 
దీప్ సిద్దుతో పాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుజ్రంత్ సింగ్‌ని పట్టిస్తే రూ. లక్ష క్యాష్ రివార్డ్ ఇస్తామని చెప్పారు. ఇక జజ్‌బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ఎక్కడ ఉన్నారో చెబితే రూ. 50వేలు అందజేస్తామని తెలిపారు.
 
జనవరి 26న ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఐతే కొందరు ఆందోళనకారులు పోలీసులు నిర్దేశించి మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో ఢిల్లీకి ప్రవేశించారు. పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలతో పాటు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 
 
రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడులు చేశారు. అంతేకాదు ఎర్రకోటపై జెండాలను ఎగురవేశారు. ఐతే రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లడంలో దీప్ సిద్దు పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. జనవరి 25న కూడా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని.. ఆయన వల్లే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కోసం గాలిస్తున్నారు.
 
రైతు సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఆ మరుసటటి దీప్ సిద్దు స్పందించారు. ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ ప్లాగ్‌ను మాత్రమే ఎగురవేశామని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని తొలగించలేదని, ఖాళీ పోస్ట్‌పైనే జెండాలు ఎగురవేశామని చెప్పారు. 
 
నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత నుంచి కనిపించాకుండా పోయారు. మరోవైపు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో దీప్ సిద్దు గతంలో దిగిన ఫొటోలను విపక్షాలు వైరల్ చేశాయి. హింసాత్మక ఘటనల బీజేపీ హస్తముందని.. రైతులకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేశారని ఆరోపించాయి.