సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (14:52 IST)

బెడ్ బాక్సులో చిక్కుకున్న 84 ఏళ్ల వృద్ధురాలు..

old woman
బెడ్ బాక్సులో చిక్కుకున్న 84 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ సమీపంలోని దేవ్‌నగర్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవ్‌నగర్‌‌‌కు చెందిన 84 ఏళ్ల వృద్ధురాలు ప్రమాదవశాత్తూ బెడ్ బాక్స్‌లో చిక్కుకున్న 84 ఏళ్ల స్వరోష్ కోహ్లీ అనే వృద్ధురాలిని ఢిల్లీ పోలీసులు కాపాడారు. 
 
ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫోన్ కాల్‌కు పోలీసులు ఆగమేఘాల మీద స్పందించడంతో పెద్దావిడకు ప్రాణాపాయం తప్పింది. ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె మనవరాలు ట్విటర్లో పోస్టు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 
స్వరోష్ కోహ్లీ కొన్నేళ్ల క్రితం తన భర్త మరణించడంతో ఇంట్లో ప్రస్తుతం ఒక్కరే ఉంటున్నారు. ఇటీవలే ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్ సెల్‌లో తన పేరు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెడ్ బాక్సును తెరుస్తూ గురువారం తూలి అందులో పడిపోయారు. అలకనందలో నివసిస్తున్న ఆమె మనవరాలు నాన్సీ కోహ్లీ తన మొబైల్ ఫోన్‌లో సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. 
 
సాయం కోరుతూ వెంటనే ప్రసాద్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి ఆమెను కాపాడినట్టు డీసీపీ భాటియా వెల్లడించారు. వృద్ధాప్యం, బలహీనత కారణంగా ఆమె బెడ్‌బాక్సులోనే పది నిమిషాల పాటు ఉండిపోయారని.. వెంటనే కాపాడామని డీసీపీ పేర్కొన్నారు.  కాగా పోలీసులు వెళ్లిన కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న నాన్సీ కోహ్లీ, ఆమె భర్త ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.