జయదేవ్ ఉనద్కట్‌కు డుం డుం డుం.. రినీ కంటారియా అనే యువతితో..?

Jaydev Unadkat
సెల్వి| Last Updated: బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:25 IST)
Jaydev Unadkat
టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనద్కట్‌కు వివాహమైంది. రినీ కంటారియా అనే యువతిని జయదేవ్ వివాహం చేసుకున్నాడు. మంగళవారం పూట సన్నిహితుల సమక్షంలో మంగళవారం వివాహ వేడుక జరిగింది.

ఈ విషయాన్ని జయదేవ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. సంప్రదాయ వస్త్రధారణలో భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్‌ చేశాడు. దీంతో కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సౌరాష్ట్ర పేసర్‌ అయిన జయదేవ్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే... కాగా 2010లో సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉనద్కట్‌, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఇక
2020లో వేలం పాటలో రాజస్థాన్ జట్టు రూ.3 కోట్లకు దక్కించుకుంది.

కానీ ఉనద్కట్‌ ఆశించిన మేర రాణించకపోవడంతో అంత భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన ఆటగాడితో రాజస్తాన్‌కు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ దిగ్గజ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు అతడిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :