శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (23:19 IST)

రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో షేర్ చేసి ట్రోల్స్‌కు గురైన సురేఖా వాణి

Surekha vani
తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి నాయకత్వం వహించింది. పలువురు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు, టీవీ ప్రముఖులు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పాటల ప్రచార రీల్స్‌ను షేర్ చేస్తున్నారు. 
 
తెలుగు నటి సురేఖా వాణి కుమార్తె, సుప్రీత కూడా అదే చేసింది. అయితే సురేఖా వాణి ట్రోల్స్‌కు గురైంది. దీనిపై ఆమె భావోద్వేగానికి గురైంది. తన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పింది.
 
 అంతకుముందు, సుప్రీత బీఆర్‌ఎస్‌కి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం రీల్స్ చేసింది. ఆపై వాటిని  తొలగించి, తన కుమార్తెతో పాటు రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను అప్‌లోడ్ చేసి సురేఖా వాణి.. ఆయనను అభినందించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత ఇది జరిగింది.
 
బీఆర్ఎస్ అధికారంలో వుండగా.. ఆ పార్టీకి మద్దతిచ్చి.. ఇప్పుడు అధికారం మారగానే రేవంత్ రెడ్డి ఫోటోను సురేఖ పోస్టు చేసిందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆమె అవకాశవాద వ్యక్తి అని ట్రోల్స్ మొదలెట్టారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నెటిజన్ల ట్రోల్స్‌తో మానసికంగా కుంగిపోయానని తెలిపింది. కొత్త సీఎంను అభినందించడం తప్పుకాదని తెలిపింది.