శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (14:45 IST)

నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు

పేకాట కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక విల్లాలో పేకాట ఆడిన కేసులో 30 మందిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు గుట్ట సుమన్ చౌదరి బర్త్ డే పార్టీ పేరుతో విల్లాను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఫార్మ్ హౌజ్‌‌ను దాని ఓనర్ రిటైర్డ్ ఐఏఎస్ గార్గ్ నుంచి నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ లీజుకు తీసుకున్నాడని నార్సింగి ఇన్‌స్పెక్టర్ శివకుమార్ అన్నారు. ‘ఆదివారం సాయంత్రం ఫామ్ హౌజ్‌పై దాడులు చేశాం. ముప్పై మందిని అరెస్ట్ చేశాం.
 
ఈ కేసులో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు నోటీసులు జారీ చేశాం. ఆయన్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించాం. ఈ కేసులో అందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. ఎవరూ పరారీలో లేరు’ అని ఎస్‌ఐ శివకుమార్ చెప్పారు.