కృష్ణ అంతిమయాత్రలో ఉద్రిక్తత... అభిమానులపై ఖాకీల లాఠీచార్జ్
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఆయన అభిమానులో లక్షలాది మంది హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. దీంతో పద్మాలయ స్టూడియో పరిసర ప్రాంతాలు కృష్ణ అభిమానులతో నిండిపోయాయి.
అయితే, చివరిచూపు కోసం వచ్చిన ప్రముఖులు, వీఐపీల కోసం అభిమానుల క్యూలైన్‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు స్టూడియో లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు అభిమానులకు రక్తపు గాయాలు అయ్యాయి.
కాగా, కృష్ణ పార్థివదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.