శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2024 (20:33 IST)

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

Venkatesh, Meenakshi Chaudhary,
Venkatesh, Meenakshi Chaudhary,
వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ ను ఈనెల 30న విడుదల చేయనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సంబంధించిన ఈ పాట ఇది. మొదటి రెండు పాటలకు చార్ట్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగల్ గోదారి గట్టు గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టు లో ప్రవేశించగా, సెకండ్ సింగిల్ మీను కూడా అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది.
 
మేకర్స్ థర్డ్ సింగల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 30న పొంగల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్  హీరో వెంకటేష్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్  కలర్ ఫుల్, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్  తో కనిపించడం అదిరిపోయింది.  
 
ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియో సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ ని హైలైట్ చేసే మరో అద్భుతమైన నెంబర్ ని కంపోజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ స్వయంగా ఈ పాట పాడటం బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. ఈ ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ నంబర్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమా మెయిన్ హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది.
 
ఈ చిత్రంలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు.