మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:59 IST)

చెన్నై చంద్రం మెరిసిపోయింది.. ఐశ్వర్య రాయ్ తేలిపోయింది..

Trisha
Trisha
చెన్నై చంద్రం త్రిష గురించి ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దక్షిణాదిన ఒకేసారి స్టార్‌డమ్‌ను చూసిన హీరోయిన్ ఆమె. అయితే కొంత కాలం సినిమాలకు దూరమైన త్రిష.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్‌లో నటిస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె పోషించిన 'కుందవై' పాత్ర హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాదులో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై త్రిష వెలిగిపోయింది. 
 
బ్లాక్ కలర్ శారీలో ఆమె గులాబీలా మెరిసిపోయింది. నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్‌గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్‌లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, ఆమె ముందు తేలిపోకుండా త్రిష ఆకర్షించింది. 
 
చూసిన వాళ్లంతా త్రిష మరింత అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు.