శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (10:58 IST)

మహేశ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌ చేయనంటున్న హీరోయిన్?

Pooja Hegde
చాలామంది హీరోయిన్లు సినిమాల్లో వచ్చే ప్రత్యేక గీతాల్లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఐటెమ్ పాటలతోనే క్రేజ్ సంపాదించుకొని, లైఫ్‌లో సెటిల్ అయిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఓ సినిమా కోసం నాలుగైదు నెలలు కష్టపడితేరాని పారితోషికాలు, ప్రత్యేక గీతాలతో సంపాదించవచ్చు. అందుకే అగ్ర కథానాయికలు సైతం ఐటెమ్ పాటల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. 
 
పైగా, ఈ తరహా పాటలకు మంచి ఆదరణ ఉండటంతో దర్శక నిర్మాతలు సైతం తమ చిత్రాల్లో ఒక్క ఐటమ్ సాంగ్‌ను ఉంచేందుకు అమితాసక్తి చూపుతూ, ఈ పాటలను బడా హీరోయిన్లతో చేయిస్తున్నారు. అయితే, పూజా హెగ్డే మాత్రం ఓ ఐటెమ్ గీతానికి 'నో' చెప్పిందని టాక్. 
 
ప్రిన్స్ మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'గుంటూరు కారం'. ఇందులో ఓ ఐటెమ్ గీతం కోసం పూజాని సంప్రదిస్తే 'నో' చెప్పిందట. కథానాయికగా తనని తప్పించారన్న బాధతోనే పూజా ఇప్పుడు ఐటెమ్ గీతం చేయడం లేదని టాక్. 
 
ఇదివరకు 'రంగస్థలం'లో 'జిగేల్ రాణి'గా మెప్పించిన పూజా.. ఈసారి మహేశ్ సినిమాకి నో చెప్పడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. అయితే, దీనికి కారణం లేకపోలేదు. నిజానికి గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్‌గా తొలుత పూజా హెగ్డేనే సంప్రదించారు. కానీ, కథా పరంగా ఆమెను కాకుండా మరో హీరోయిన్‌ను ఎంపిక చేశారు. ఈ కోపంతోనే ఆమె ఇపుడు ప్రత్యేక గీతం చేయనని చెబుతోంది.