శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (12:26 IST)

ఆవారా సీక్వెల్‌లో కార్తీతో రొమాన్స్ చేయనున్న బీస్ట్ హీరోయిన్?

Pooja Hegde
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఊపిరి ఫేమ్ కార్తీతో రొమాన్స్ చేయనుంది. ఆవారా సీక్వెల్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఆవారాలో తెల్లపిల్ల తమన్నా, కార్తీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. 
 
ఇదే తరహాలో ఆవారా సీక్వెల్‌లోనూ పూజా హెగ్డే- కార్తీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే పూజా హెగ్డేను సంప్రదించినట్లు కోలీవుడ్ టాక్. 
 
కార్తీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వస్తుందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 'బీస్ట్' తరువాత పూజా హెగ్డే చేసే సినిమా ఇదే అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది.