1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (14:11 IST)

పూజా హెగ్డేను లేకుండా చేశారు.. త్రివిక్రమ్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

pawan - trivikram
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "బ్రో". సముద్రఖని దర్శకుడు కాగా, జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ తాజాగా బ్రో టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రో సినిమా టీజర్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. 
 
బ్రో సినిమాకు ఎలాంటి సంబంధం లేని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రో చిత్రంకు త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే. 
 
అయితే బ్రో సినిమా టీజర్ ప్రారంభంలో ఓ కమర్షియల్ వస్తుండగా.. అందులో పూజా హెగ్డే వున్నారు. పూజా యాడ్ కోసమే టీజర్‌ను లేట్‌గా రిలీజ్ చేశారంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. 
 
పూజా హెగ్డేను బ్రో టీజర్‌లో పెట్టడానికే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి తీసేశావ్ అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌పై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.