శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:00 IST)

అనుభవమున్న హీరో సల్మాన్ .. బాగానే హ్యాండిల్ చేస్తారు : పూజా హెగ్డే

తెలుగు చిత్రపరిశ్రమలో బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన భామ పూజా హెగ్డే. టాలీవుడ్‌లో ఈమె పట్టిందల్లా బంగారంగా మారిపోయింది. ఏ చిత్రంలో నటించినా అది సూపర్ హిట్ అవుతోంది. పైగా, ఏ హీరోతో జోడీ కట్టినా అతని ఖాతాలో హిట్ పడిపోతోంది. రంగస్థలం (ఐటమ్ సాంగ్), మహర్షి, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. దీంతో ఫుల్‌బిజీ హీరోయిన్ల జాబితాలో మొదటిస్థానంలో ఉంది. అయితే, ఇతర భాషల్లో వచ్చే అవకాశాలను కూడా ఆమె వదులుకోవడం లేదు. ముఖ్యంగా, బాలీవుడ్‌లో వచ్చే ఛాన్సును అస్సలు మిస్ కావడంలేదు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన అవకాశాన్ని దక్కించుకుంది. ఆయన జోడీగా 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. ఈ అవకాశంపై పూజా హెగ్డే స్పందిస్తూ, 'సల్మాన్ గొప్ప నటుడు .. ఆయన సరసన నటించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఆయన సొంతం. ఆయన సీనియారిటీ .. క్రేజ్ నన్ను కాస్త భయపెడుతున్నాయి. ఇక ఆయన జోడీగా ఛాన్స్ దక్కడం ఆనదంగాను వుంది. నటనపరంగా ఆయన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఎదురుచూస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.