శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (11:43 IST)

డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట.. ఎందుకో తెలుసా?

డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట. ప్రభాస్ ధోరణి వారికి నచ్చడం లేదట. బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో వున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహోలో నటించాడు. ప్రభాస్ నటించిన `సాహో` విడుదలై దాదాపు ఏడాది దాటిపోతోంది.
 
అయినా ప్రభాస్ తర్వాతి సినిమా విడుదల గురించి ఎలాంటి సమాచారమూ లేదు. కనీసం టైటిల్ కూడా ప్రకటించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు నిర్మాణ సంస్థ `యువీ క్రియేషన్స్` బ్యానర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
 
సినిమా షూటింగ్ సగం పూర్తయినా కనీసం టైటిల్, ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేయలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ కంటే ముందే ప్రభాస్ మూవీ ప్రారంభం అయింది. అయినా సినిమాపై అప్ డేట్ లేదని వాపోతున్నారు. 
 
ఇకపోతే.. రాధాకృష్ణ ప్రాజెక్టును కూడా పాన్ ఇండియాగా మార్చేశారు. ఆ ప్రాజెక్టుకు రాధే శ్యామ్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా కథ ప్రకారం విదేశాల్లో తప్పకుండా షూటింగ్స్ చేయాల్సింది.. కానీ సెట్స్ ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్సుకు నిరాశ తప్పేలా లేదు.