సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (20:55 IST)

వడివేలు కోసం ప్రభుదేవా.. నాయి శేఖర్ రిటర్న్స్ కోసం స్టెప్పులు

Vadivelu
తమిళ కమెడియన్ వడివేలు గతంలో నాయిశేఖర్‌గా అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఆ పాత్రనే కీలకంగా తీసుకొని 'నాయి శేఖర్‌ రిటర్న్స్‌' అనే సినిమా చేస్తున్నారు. అందులో ఓ కీలకమైన పాటకు స్టెప్పులు కంపోజ్‌ చేయడానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా వచ్చారట. 
 
సౌత్ ఇండియాలో టాప్ హీరోలందరికీ డ్యాన్స్ కంపోజ్‌ చేసిన ప్రభుదేవా.. వడివేలు కోసం రంగంలోకి దిగడం పట్ల వడివేలు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. నాయి శేఖర్‌ రిటర్న్స్‌ సెట్‌లో వడివేలు, ప్రభుదేవా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ప్రభుదేవాకి, వడివేలుకి మంచి అనుబంధం ఉంది. గతంలో చాలా సినిమాల్లో ఇద్దరూ కలసి పని చేశారు. ఆ అభిమానంతోనే వడివేలు కోసం ప్రభుదేవా డ్యాన్స్‌ కంపోజ్‌ కోసం ముందుకొచ్చారని టాక్‌.