శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 18 మే 2020 (22:07 IST)

ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్

ప్రియా ప్రకాష్‌ వారియర్.. ఈ పేరు వినగానే ఠక్కున మలయాళంలో రూపొందిన ఒరు ఆడార్ ల‌వ్ సినిమాలో కన్ను కొట్టే సీన్ గుర్తుకువస్తుంది. ఈ ఒక్క సీన్‌తోనే ఈ మలయాళ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయ్యింది. ఎంతలా అంటే... ఈ అమ్మడుతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు సినిమాలు చేసేందుకు పోటీపడేంత. 

మలయాళంలో రూపొందిన ఆ చిత్రం సినిమా తెలుగులో లవర్స్ డే టైటిల్‌తో రిలీజైంది. ఈ కేరళ కుట్టి అప్పుడు వార్తల్లో నిలిచింది. ఇంతకీ విషయం ఏంటంటే... ఈ అమ్మడు ఇన్‌స్టాలో బాగా పాపులర్. 70 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఏదైనా ఒక వీడియో కానీ, ఫోటో కానీ పెట్టడమే ఆలస్యం. క్షణాల్లో ఆమె పోస్టుకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. 
 
తన అందంచందాలతో ఆమె చేసిన వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. ఇలా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ అమ్మడు షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా షాక్ అంటే... ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇన్‌స్టా నుంచి తప్పుకుంది.
 
 ట్రోల్స్ వలన అసహనానికి గురై ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ నిర్ణయంపై ప్రియా ప్రకాష్‌ వారియర్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.