ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (14:20 IST)

ప్రియా ప్రకాష్ వారియర్‌పై కన్నేసిన శ్రీనివాసుడు

మలయాళంలో ఒరు ఆడార్ లవ్‌తో వెండితెర అరంగేట్రం చేసిన ప్రియా వారియర్... ఇపుడు తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. యువ హీరో నితిన్ సరసన నటించే అవకాశాన్ని ఆమె కైవసం చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుంత నితన్ భీష్మ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితన్ నటించనున్న చిత్రంలో ప్రియా ప్రకాష్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. 'మనమంతా' తరువాత చంద్రశేఖర్ యేలేటి నుంచి రానున్న సినిమా ఇదే. 
 
నిజానికి "ఒరు ఆదార్ లవ్" సినిమాతో ఓవర్ నైట్లోనే ఆమె స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఆ సినిమా మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువైయ్యాయి. అయితే తాజాగా ప్రియా వారియర్ తెలుగులో ఒక ఛాన్స్ దక్కించుకుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.