మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (11:13 IST)

ట్రోలర్స్‌కు చెక్ పెట్టిన ప్రియమణి.. "మిస్ యు ముస్తఫా రాజ్" అంటూ లవ్‌సింబల్

Priyamani
Priyamani
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా ముద్ర వేసుకుని.. వివాహం తర్వాత సినిమాలకు కాస్త దూరమై ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ప్రియమణి. నారప్ప సినిమాతో వెండితెరపై తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ఫ్యామిలీ మ్యాన్2లోనూ మెరిసింది. 
 
తాజాగా భామ కలాపం వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తన భర్త ముస్తఫాతో కలిసి వుండట్లేదని.. ఆమెకు ముస్తఫాకు విడాకులు అయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రియమణి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రియమణిపై ట్రోల్స్ మొదలైయ్యాయి. 
 
అయితే ట్రోలర్స్ ప్రియమణి సరిగ్గా గుణపాఠం చెప్పింది. దీపావళి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను నెట్టింట పోస్టు చేసింది. అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. 
 
అంతేగాకుండా.. "మిస్ యు ముస్తఫా రాజ్" అంటూ లవ్ సింబల్ షేర్ చేసింది. దీంతో ట్రోలర్స్ నోరు మూసినట్లైంది. ముస్తఫా ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. సినిమా షూటింగ్‌ల కారణంగా ప్రియమణి ఇండియాలో వుంటున్నారు.