సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (14:02 IST)

నాభి దగ్గర టాటూ.. ఇష్టం లేకపోయినా నటించాను.. ప్రియమణి

priyamani
అగ్రహీరోలతో పలు సినిమాల్లో నటించిన ప్రియమణి.. బుల్లితెరపై పలు షోల్లో జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా గుర్తు చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 
ఓ షూటింగ్ జరుగుతుండగా.. సన్నివేశంలో నాభిని చూపించే సన్నివేశం ఉందని.. నాభి దగ్గర టాటూ చూపిస్తూ ఆ సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ముందుగా నాకు దాని గురించి చెప్పలేదు. అయినా సరే నేను చేశాను.. అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. 
 
నిజానికి హీరోయిన్స్ సన్నివేశానికి తగ్గట్టుగానే అందాలను చూపిస్తారు. కొన్నిసార్లు ఇష్టం లేకుండా ఇలా అందాలు చూపిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ప్రియమణిల విషయానికొస్తే.. ఇటీవలే వెంకటేష్ నటించిన నారప్పలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.