శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (22:48 IST)

సమంత-చైతూ విడాకులు... మా జీవితకాలం నుంచి తొలగిపోయింది.. (video)

samanta nagachaitanya engagement
టాలీవుడ్ నటులు సమంత, నాగ చైతన్యల విడాకులపై కింగ్ నాగార్జున స్పందించారు. సమంత, చైతూల విడాకుల విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై  నాగార్జున తన కుమారుడు నాగ చైతన్య విడాకుల గురించి కామెంట్స్ చేశాడు.
 
తన కుమారుడి జీవితంలో ఇది దురదృష్టకర అనుభవం అని నాగ్ అన్నారు. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, తాము దాని గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. 
 
విడాకుల సమస్య తమ జీవితాల నుండి తొలగిపోయిందని .. అది త్వరలో అందరి జీవితాల నుండి బయటపడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. కాగా నాగార్జున ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.