బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (22:04 IST)

ఆ దరిద్రం వదిలిపోయింది.. ఇక పట్టించుకోను.. జై పవన్.. పృథ్వీ

Prithvi
కమెడియన్ పృథ్వీ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారారు. నిన్నటివరకు జగనన్న పార్టీ జండా మోసిన పృథ్వీ.. ఇప్పుడు జనసేనకు జై కొట్టారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.  
 
త్వరలోనే జనసేన పార్టీలో చేరుతున్నానని పృథ్వీ క్లారిటీ ఇచ్చారు. అధికారం ఉన్నా, లేకపోయినా… పవన్‌ కల్యాణ్‌ పేదలకు దగ్గరగా ఉంటారని కితాబిచ్చారు. అలాగే పవనే మా నాయకుడు, పెద్ద అని చెప్పుకొచ్చారు. ఇక వైసీపీకి మంగళం పాడేశాను. ఆ దరిద్రం అయిపోయింది, ఇక పట్టించుకోను. 
 
కరోనా వస్తే నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు అని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పృథ్వీ ప్రకటించారు.