బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (22:13 IST)

బాలీవుడ్ టీవీ నటి నిషి సింగ్ కన్నుమూత

Nishi Singh
Nishi Singh
బాలీవుడ్ సీనియర్ టీవీ నటి నిషి సింగ్ కన్నుమూశారు. గత మూడేళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిషి సింగ్ ఆదివారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయస్సు 50.. మూడు రోజుల ముందే ఆమె తన పుట్టినరోజును ఘనంగా జరుపుకొని 50వ పడిలోకి అడుగుపెట్టింది. ఈలోపే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. 
 
"ఆమె గొంతులో ఇన్ఫెక్షన్ ఉంది. నోటి మాట లేదు.. అయినా పుట్టినరోజున ఆమె ఎంతో ఆనందంగా కనిపించింది. కూతురు, కొడుకుతో ఆడుకొంది. దగ్గర ఉండి వారే నిషితో కేక్ కట్ చేయించారు" అని నిషి భర్త సంజయ్ సింగ్ తెలిపారు. ఇక నిషి .. ఖాబుల్ హై, ఇష్క్ బాజ్ లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.