బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:18 IST)

రాధేశ్యామ్ 14 జనవరి, 2022 సంక్రాంతికి విడుదల

Prabhas new look
ప్రభాస్, పూజా హెగ్డే నటించిన 'రాధేశ్యామ్' టైటిల్ ప్రకటించినప్పటి నుండి చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. అందుకు త‌గిన‌ట్లుగా చిత్రాన్ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తీర్చిదిద్దుతున్నారు. రొమాంటిక్-డ్రామాగా చిత్రం రూపొందుతోంది.
 
రాధేశ్యామ్ మేకర్స్ ఈ సినిమా కోసం ముందుగా నిర్ణయించిన పండుగ విడుదల తేదీకి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే 14 జనవరి 2022 న విడుదల కానున్న‌ద‌ని బుధ‌వారంనాడు వెల్ల‌డించారు. దానితోపాటు ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. లవర్ బాయ్ అవతార్‌లో ప్రభాస్ లుక్ ఆ క‌ట్టుకునేలా వుంది. రొమాంటిక్ సిటీ ఇటలీ సుందరమైన నేపథ్యంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగా కుదిరింద‌ని మేక‌ర్స్ తెలియ‌జేస్తున్నారు.
 
పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు, డా.యు.వి.కృష్ణం రాజు గోపికృష్ణ మూవీస్ సమర్పణలో రూపొందుతోంది. యువి క్రియేషన్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు.