శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (10:42 IST)

భైరాదేవీ లో అఘోరగా రాధికా కుమారస్వామి

Bhairadevi
Bhairadevi
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య కన్నడ ప్రముఖ నటి రాధికా కుమారస్వామి కొత్త చిత్రం ‘భైరా దేవీ’లో అఘోరగా కనిపించబోతున్నారు. రాధిక బర్త్ డే సందర్భంగా భైరా దేవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
 
భైరా దేవీ చిత్రంలో రాధిక ఓ అఘోరగా కనిపించనున్నారు. ఇక ఈ పోస్టర్‌లో రాధిక త్రిశూలం చేత పట్టుకుని కనిపించారు. బ్యాక్ గ్రౌండ్‌లో అఘోరాలు కూడా కనిపిస్తున్నారు. పోలీస్ పాత్రలో రమేష్ అరవింద్ కనిపిస్తున్నారు. లేడీ అఘోర పాత్రను మెయిన్ లీడ్‌గా పెట్టి సినిమా తీస్తుండటం ఇదే మొదటి సారి కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచేసినట్టు అయింది.
 
భైరా దేవీ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగానూ రాధిక కుమారస్వామి వ్యవహరించారు. శ్రీజై ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు.
 
రంగయాన రఘు, రవి శంకర్, స్కంద అశోక్, అను ముఖర్జీ, మాళవిక అవినాష్, సుచేంద్ర ప్రసాద్ వంటి వారు నటించిన ఈ చిత్రానికి రవిరాజ్, యాదవ్‌లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.
 
జేఎస్ వాలి సినిమాటోగ్రఫర్‌గా, కేకే సెంథిల్ ప్రసాథ్ సంగీత దర్శకుడిగా, సీ రవిచంద్రన్ ఎడిటర్‌గా, కే రవి వర్మ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మోహన్ బి కేరు ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను హ్యాండిల్ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి, తమిళంలో తమరాయ్, శ్రీజై సాహిత్యాన్ని అందించారు. వారణాసి, కాశీ, హరిద్వార్, హైద్రాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రదేశాల్లో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.