సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (18:57 IST)

రాహుల్ సిప్లిగంజ్‌తో అషురెడ్డి.. ఫోటో సంగతేంటి?

Rahul Sipligunj-Ashu Reddy
బిగ్ బాస్ సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్‌తో అషురెడ్డి చాలా వరకు దూరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే హౌస్ నుండి బయటకు వచ్చిందో.. రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అప్పుడప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. తాజాగా అషు రెడ్డి ఇంస్టాగ్రామ్‌లో అస్క్ మీ అనే సెక్షన్ ను ఏర్పాటు చేసింది.
 
ఈ క్రమంలోనే రాహుల్ , అజయ్ ని పోలుస్తూ ఒక ప్రశ్న ఎదురైంది.. దానికి గాను ఈ ముద్దుగుమ్మ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోలు పెట్టేసి.. ఒకరు తన ఫ్రెండ్ అని మరొకరు నా ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలియజేసింది. ఈ విషయం తెలిసిన రాహుల్ అభిమానులు.. తనే అషు రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.