మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (17:29 IST)

సాయిరామ్ శంకర్ న‌టించిన ఒక పథకం ప్రకారం టీజర్ ఆవిష్క‌రించిన రవితేజ

Sairam Shankar, Ravi Teja, Vinod Vijayan
Sairam Shankar, Ravi Teja, Vinod Vijayan
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది.
 
సినిమా కాన్సెప్టును టీజర్‌లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా టీమ్ లో ఉన్నారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
 
నటీనటులు:
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతి సోధి, సముద్రఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: వినోద్ విజయన్
నిర్మాతలు: వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్
నిర్మాణ సంస్థలు: వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్
ఎడిటింగ్: కార్తిక్ జోగేష్
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, వినోదిల్లంపల్లి, సురేష్ రాజన్
సంగీతం: రాహుల్ రాజ్
రీ రికార్డింగ్: గోపీ సుందర్