సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (10:38 IST)

పునర్నవి పేరెంట్స్‌ను కలిసిన రాహుల్.. ఆల్బమ్ కోసమా? పెళ్లి కోసమా?

బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ రాహుల్, పునర్నవిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారని టాక్ వస్తోంది. విన్నర్ రాహుల్ పున్నుపై అమితమైన ప్రేమతో వున్నాడని.. ఆమెనే వివాహం చేసుకోవాలని గట్టిగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పున్ను పారెంట్స్‌ను రాహుల్ కలిసినట్లు సమాచారం. కాగా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 కోసం ఒకే ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారిందని అందరు చెవులు కొరుక్కున్నారు. 
 
ఈ షో తరువాత బిజీ అయిపోయిన వీరిద్దరూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. రాహుల్ కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. అటు సింగర్ గానే కాకుండా అటు నటుడిగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో రాహుల్ అవకాశం పట్టేసాడు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో రాహుల్‌ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. అ
 
యితే ఈ సినిమా యూనిట్ నటీనటులకు ఓ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రాహుల్‌తోపాటు పునర్నవి కూడా పాల్గొంది. అంతేగాకుండా.. పున్ను రాహుల్ ఇద్దరూ ఈ సినిమాలోని ఒక పాట పాడుతూ డ్యాన్స్‌ కూడా చేసారు. రాహుల్ కూడా ఇటీవల పునర్నవి పేరెంట్స్‌ను కలిసాడు.
 
ఆ ఫోటోలను ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసాడు. అప్పట్లో తనను విన్నర్‌గా గెలిచిపించిన అభిమానుల కోసం తాను, పునర్నవి కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆ ఆల్బమ్ పర్మిషన్ గురించి పునర్నవి పేరెంట్స్‌ను కలిసినట్టు తెలిపాడు. ఈ ఆల్బమ్ లో పునర్నవి నటించబోతోన్నట్లు తెలుస్తోంది. బేబీ అంటూ సాగే ఒక సాంగ్ కు శాంపిల్ రిథమ్ కంపోసింగ్ కూడా చేసినట్టు సమాచారం.