1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (13:24 IST)

తెరపై భయపెడుతూ.. తెరవెనుక భయపడుతున్న రాయ్ లక్ష్మీ..

టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న బ్యూటీ రాయ్ లక్ష్మీ. అమ్మడు ఇటీవల మునీ, అరణ్మనై అంటు పలు హర్రర్ చిత్రాల్లో నటించి అలరించింది. తాజా సమాచారం ఏమిటంటే ఇటీవల 'షావుకారు పేట్టై' అనే హారర్ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత, ఆమె తనకి కేటాయించిన స్టార్ హోటల్లో బస చేసిందట. అయితే అర్థరాత్రి సమయంలో ఏవో చిత్రమైన దృశ్యాలు కనిపించడం, వింత శబ్దాలు వినిపించడంతో ఆమె భయంతో గడ గడ వణికిపోయిందట.
 
అంతేకాదు తనకి ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పి హోటల్ సిబ్బందిని కూడా కంగారు పెట్టిందట. హారర్ సినిమాలో నటిస్తుండటం వలన ఆ ఆలోచనలో అలా అనిపించి ఉండవచ్చని సన్నిహితులు అంటున్నారు. ఎందుకంటే గతంలో 'అరణ్మనై' అనే హారర్ సినిమా షూటింగ్ చేసే సమయంలోను లక్ష్మీ ఇలా భయపడిందట. మరి అమ్మడు ఎప్పుడు ఆ భయం నుంచే తెరకెక్కుతుందో వేచి చూడాలి.