శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (14:28 IST)

ప్రతి ఒక్క అభిమానితో ఫోటో దిగడం సాధ్యం కాదు.. జిల్లాలకు వస్తా: రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మళ్లీ దుమారం రేగింది. ఏప్రిల్ రెండో తేదీన అభిమానులతో జరగాల్సిన సమావేశం.. ఈ నెల 12-16 తేదీల మధ్య వాయిదా పడింది. అయితే ఈ సమావేశాన్ని కూడా రజనీకాంత్ రద్దు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మళ్లీ దుమారం రేగింది. ఏప్రిల్ రెండో తేదీన అభిమానులతో జరగాల్సిన సమావేశం.. ఈ నెల 12-16 తేదీల మధ్య వాయిదా పడింది. అయితే ఈ సమావేశాన్ని కూడా రజనీకాంత్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. చెన్నైలోని  రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశాలను నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. 
 
అయితే అనివార్య కారణాల వల్ల అభిమానులతో సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు సూపర్ స్టార్ రజనీ ప్రకటించారు. తమిళనాడులో జిల్లాల వారీగా విడిగా సమావేశాలు నిర్వహించి అందులో పాల్గొంటానని చెప్పారు. ప్రతి ఒక్క అభిమానిని తనను నేరుగా కలిసి ఫోటో దిగాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుసుకున్నానని.. కానీ ప్రతి ఒక్క అభిమానితో ఫోటో దిగడం సాధ్యం కాని పని అంటూ రజనీకాంత్ స్పష్టం చేశారు. 
 
అందుకే జిల్లాల వారీగా సమావేశాలలో పాల్గొంటానని రజనీకాంత్ చెప్పారు. అప్పుడు అందరికీ తనను కలిసే వీలు కుదురుతుందని.. దయచేసి అభిమానలు తన పరిస్థితిని అర్థం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు. 12న రజనీకాంత్ ఏర్పాటు చేయాలనుకున్న సమావేశంతో తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అదే  రోజున రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించాలనుకున్నామని.. కానీ కొన్ని అనివార్య కారణాల చేత రద్దు చేసుకుంటున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు.